News

PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన యొక్క 15వ విడత నిధులు జమ అయ్యేది అప్పుడే? పూర్తి వివరాలకు చదవండి

Gokavarapu siva
Gokavarapu siva

దేశంలోని రైతుల ఆర్థిక సహాయం కోసం భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను అమలు చేస్తోంది. ప్రతి ఏటా 6 వేల రూపాయలను రైతుల బ్యాంకు ఖాతాలకు వాయిదాల్లో వేస్తున్నారు. ఈ పథకం ప్రకారం, ప్రభుత్వం ప్రతి 4 నెలల వ్యవధిలో 3 విడతలుగా రైతుల ఖాతాలకు రూ.2,000 జమ చేస్తున్నారు. 2019 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 14 వాయిదాలను రైతుల ఖాతాలకు ప్రభుత్వం జమ చేసింది. ప్రస్తుతం 15వ విడత ఎప్పుడెప్పుడా అని రైతులు ఎదురు చూస్తున్నారు.

PM కిసాన్ యోజన: ఎలా నమోదు చేసుకోవాలి?

PM కిసాన్ యొక్క 15వ వాయిదాలను పొందడానికి, e-KYC ప్రక్రియను పూర్తి చేయాలి. మీరు ఇంకా KYC చేయకుంటే, త్వరగా పూర్తి చేయండి. మీరు సమీపంలోని CSC కేంద్రం లేదా PM కిసాన్ పోర్టల్ pmkisan.gov.in ద్వారా మీ రిజిస్ట్రేషన్‌ను చేసుకోవచ్చ. పీఎం కిసాన్ యోజన కోసం నమోదు చేసుకునేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి . మీరు నింపిన దరఖాస్తు ఫారమ్‌లో పేరు మరియు చిరునామాకు సంబంధించి ఎటువంటి పొరపాటు చేయవద్దు. ఇది కాకుండా, మీ లింగం , పేరు , ఆధార్ నంబర్‌ను సరిగ్గా పూరించండి. ఈ చిన్న చిన్న పొరపాట్ల వల్ల మిమల్ని వాయిదాల నుండి తప్పించవచ్చు.

15వ విడత ఎప్పుడు వస్తుంది ?
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి విడుదల తేదీని భారత ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. అయితే, పాత డేటా ప్రకారం, నవంబర్ లేదా డిసెంబర్ నెలలో ఈ ఏడాది చివరి నాటికి 15వ విడత రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి..

సెప్టెంబర్ లో మళ్లి వర్షలు..

ఈ పథకానికి సంబంధించిన ఏదైనా సమస్య కోసం రైతులు ఇమెయిల్ ఐడి pmkisan-ict@gov.in మరియు హెల్ప్‌లైన్ నంబర్- 155261 లేదా 1800115526 లో టోల్ ఫ్రీని సంప్రదించవచ్చు.

మరొకవైపు రైతులకు ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం క్రింద ఏడాదికి రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని కేంద్రం అందిస్తోంది. రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో ఈ డబ్బును రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. అయితే.. ఈ మొత్తాన్ని 50 శాతం వరకు పెంచాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రధానమంత్రి కార్యాలయం ముందు ఉన్నాయని అనేక కధనాలు మీడియాలో వస్తున్నాయి. అయితే ఈ విషయంపై కేంద్రం ఎటువంటి ప్రకటనా చేయలేదు కాబ్బట్టి వచ్చే వార్తలు అన్ని కూడా ఉట్టి పుకార్లుగా భావించాలి .

ఇది కూడా చదవండి..

సెప్టెంబర్ లో మళ్లి వర్షలు..

Share your comments

Subscribe Magazine