Agripedia

మిరప సాగులో అధికంగా వ్యాపించే బ్యాక్టీరియా తెగుళ్లు, నివారణ చర్యలు..!

KJ Staff
KJ Staff

మన రాష్ట్రంలో సాగుచేస్తున్న వాణిజ్య పంటల్లో
మిరప సాగు ప్రధానమైనదిగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిరప పంట దాదాపు 4 లక్షల ఎకరాలలో సాగుచేస్తూ ఐదున్నర లక్షల టన్నుల దిగుబడిని సాధిస్తూ దేశంలోనే ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. రైతులు మిరప పంటను ఖరీఫ్ సీజన్లో అయితే జులై,ఆగస్టు నెలలో సాగు చేస్తారు.రబీ సీజన్లో అయితే అక్టోబర్, నవంబర్ నెలలో సాగుకు అనుకూలంగా చెప్పవచ్చు. ఇక వాతావరణ విషయానికొస్తే 15 డిగ్రీల నుండి 35 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న వాతావరణం మొక్కలు ఏపుగా పెరిగి అధిక దిగుబడులను ఇస్తాయి.

మిరప పంట సాగలో బ్యాక్టీరియా తెగుళ్ల ఉధృతి అధికంగా ఉంటుంది.సరైన యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు చేపట్టినట్టు అయితే బ్యాక్టీరియా తెగుళ్ళను సమర్థవంతంగా ఎదుర్కొని అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. మిరప సాగులో ప్రధానంగా వచ్చే బ్యాక్టీరియా తెగుళ్లు నివారణ చర్యలు గురించి ఇప్పుడు చూద్దాం.

కోయనోఫోరా కొమ్మ కుళ్ళు తెగులు: మొక్కల లేత ఆకులు,చిగుళ్ళు మాడిపోయి, కొమ్మల కణుపుల వద్ద కుళ్ళు కనపడి కొమ్మలు విరిగి పోతాయి. ఈ తెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3. గ్రా లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి

ఆకుమచ్చ తెగులు : తేమతో కూడిన వాతావరణం, అధిక వర్షాలు పడుతున్నప్పుడు ఈ తెగులు ఉధృతి అధికంగా ఉంటుంది. ఈ తెగులు సోకితే ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడి కొన్ని రోజులకు ఆకులు పండుబారి రాలిపోతాయి. నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రా. + 1 గ్రా. స్ట్రెప్టోసైక్లిన్ లేదా 2 గ్రా. పోషామైసిన్ 10 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి.

కాయ కుళ్ళు తెగులు మరియు కొమ్మ ఎండు తెగులు: ఈ తెగులు సోకితే కాయల మీద నల్లటి మచ్చలు ఏర్పడి కుళ్ళిపోతాయి. మరియు ముదురు కొమ్మలపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. కొమ్మల చివర్ల నుండి క్రిందికి ఎండి దిగుబడి భారీగా తగ్గుతుంది. ఈ తెగులు నివారణకి క్లోరాంట్రానిల్ల్ 2 మి.లీ,మాంకోజెబ్ 2.5 గ్రా/లీ.3. గ్రా, ధైరం లేక కాప్టాన్, కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి.

Share your comments

Subscribe Magazine