Agripedia

విత్తనశుద్ధిని విధిగా పాటించాలి !

KJ Staff
KJ Staff

పంట కు విత్తనాల ద్వారా మరియు నేల ద్వారా ఆశించే తెగుళ్ల నుండి సంరక్షించడానికి, అదే విధంగా పంట తొలి దశ లో ఆశించే రసం పీల్చు పురుగులను నివారించడానికి వివిధ రకాల శిలీంద్రనాశినులతో, కీటకనాశినులతో మరియు జీవసంబంధమైన రసాయనాలతో విత్తన శుద్ధి చెయ్యాలి. దీని వలన విత్తనం యొక్క మొలక శాతం పెరగడం తో పాటు, పంట ఆరోగ్యం గా ఉండి చీడ పీడలను తట్టుకుంటుంది. తెలంగాణ లో వానాకాలం లో వివిధ పంటలను సాగు చేసే రైతులు నాణ్యమైన, తెగుళ్లను తట్టుకునే పంట రకాలను ఎంచుకోవడం తో పాటు క్రింద తెల్పిన విధంగా విధిగా విత్తనశుద్ధి చేసుకోవాలి.

వరి

నారుమడులను సిద్ధం చేసుకునే రైతులు ముందుగా విత్తనశుద్ధి పై శ్రద్ధ వహించాలి. మెట్ట నారుమడులకు అయితే కిలో విత్తనానికి 3గ్రా. కార్బండజిమ్ ను తడి తో పట్టించి ఆరబెట్టి నారు మడి లో చల్లుకోవాలి. దమ్ము చేసిన నారు మడులకైతే లీటరు నీటికి 1 గ్రాము కార్బండజిమ్ కలిపిన ద్రావణం లో 24 గంటలు నానబెట్టి, తరువాత మండే కట్టిన మొలకలను నారు మడి లో చల్లుకోవాలి. కిలో విత్తనాలు నానబెట్టడానికి లీటరు రసాయనం కలిపిన నీరు సరిపోతుంది. ఈ విధంగా శీలింద్రనాశిని తో విత్తనశుద్ధి చేయడం వలన మొక్కకు తొలి దశ లో ఆశించే అగ్గి తెగులు మరియు ఆకు మచ్చ తెగుళ్లను నివారించవచ్చు. అదేవిధంగా వరి నాట్లు వేసే ముందు నారు కట్టలను, క్లోరిపెరిఫాస్ 50% ఇ.సి 1.6 మి.లీ ను లీటరు నీటికి కలిపిన ద్రావణం లో 12 గం. ఉంచినట్లయితే తొలి 30 రోజుల వరకు వరి పంటను ఆశించే కాండం తొలిచే పురుగు, తాటాకు తెగులు, పచ్చదోమలను నివారించవచ్చు.

చెరుకు

 విత్తనం కోసం జూన్-జూలై మాసం లో చెరుకు నాటుకునే రైతులు తప్పనిసరి గా విత్తనశుద్ధి ని చేసుకోవాలి. ముచ్చెలను వేడి నీటి లో 520 సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద 30 నిమిషాలు లేదా తేమతో మిళితమైన వేడి గాలి లో 540 సెల్సియస్ వద్ద 2 గం. ఉంచి శుద్ధి చేయాలి, దీని వలన గడ్డి దుబ్బు తెగులు, ఆకు మాడు మరియు కాటుక తెగుళ్లను నివారించవచ్చు.

సోయాచిక్కుడు

పంట తొలి దశలో ఆశించే మొవ్వుకుళ్ళు తెగులు మరియు ఆకు మచ్చ తెగుళ్ల నుండి సంరక్షించడానికి కిలో విత్తనానికి 1 గ్రాము కార్బండజిమ్ లేదా 3 గ్రాముల థైరామ్ లేదా కాప్టాన్ తో విత్తనశుద్ధి చేయాలి. తరువాత 1.5 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ 48% తో విత్తనశుద్ధి చేయాలి, దీని వలన రసం పీల్చే తామర పురుగులు మరియు కాండం తొలిచే ఈగ నుండి పంట రక్షించబడుతుంది. దాని తరువాత ప్రతి పది కిలోల విత్తనానికి 200 గ్రాముల

రైజోబియం కల్చర్ ను తగినంత నీరు మరియు జిగురు ను కలిపి విత్తనానికి పట్టించి, నీడలో ఆరబెట్టి అరగంట తర్వాత విత్తుకోవాలి, దీని వలన నత్రజని స్థిరీకరణ పెరిగి అధిక దిగుబడులు సాధించవచ్చు.

పసుపు

పసుపు పంట ను దుంప వేరు కుళ్ళు తెగులు మరియు ఆకుమచ్చ తెగుళ్ళనుండి కాపాడుకోవడానికి లీటరు నీటికి 3 గ్రాముల మ్యాంకోజెబ్ లేదా 3 గ్రా. మెటలాక్సిల్ కలిపిన ద్రావణం లో 40 నిమిషాల సేపు కొమ్ములను ఉంచి బయటకు తీసి నీడలో ఆరబెట్టాలి. పసుపు కొమ్ము/ విత్తనాలకు పొలుసు పురుగు ఆశించి ఉన్నప్పుడు శీలిందనాశిని తో పాటు లీటరు నీటికి 5 మి.లీ మలాదియాన్ మరియు 2 :

మోనోక్రోటోఫాస్ కూడా కలిపి, తర్వాత నీడలో ఆరబెట్టి, నీటి ని మార్చి 5గ్రా. ట్రైకోడెర్మా విరిడే కలిపిన ద్రావణం లో ముంచి కొమ్ములను నీటిలో ఆరబెట్టి విత్తుకోవాలి.

 వేరుశనగ

ఆకు మచ్చ తెగులు, కాండం మొదలు కుళ్ళు తెగులు ను పంట తొలి దశలో నివారించడం కోసం కిలో విత్తనానికి 3గ్రాముల మ్యాంకోజెబ్ లేదా 1 గ్రాము కార్బండజిమ్ తో విత్తనశుద్ధి చేసుకోవాలి. వేరు పురుగు ఆశించే ప్రాంతాల్లో కిలో విత్తనానికి 7 మి.లీ క్లోరిపైరిఫాస్ కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. కంది

కంది లో విత్తనం ద్వారా సంక్రమించే ఎండు తెగులును నివారించడానికి తెగులును తట్టుకునే రకాలను సాగు చేయడం తో పాటు 10గ్రాముల ట్రైకోడెర్మా విరిడే తో కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. దాని తరువాత, ఎకరాకు సరిపోయే విత్తనానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ తో విత్తనశుద్ధి చేసుకోవాలి.

కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ యాంత్రీకరణ ఉప పథకం (SMAM) కింద రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది !

పెసర, మినుము

కిలో విత్తనానికి 2.5 గ్రాముల మ్యాంకోజెబ్ తో విత్తనశుద్ధి చేయడం వలన ఆకుమాడు తెగుళ్ల నుండి పంట ను కాపాడవచ్చు. పైరు తొలి దశలో ఆశించే రసం పీల్చు పురుగుల నుండి పంట రక్షణ కొరకు కిలో విత్తనానికి 5 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ లేదా మోనోక్రోటోఫాస్ తో విత్తనశుద్ధి చేయాలి.

అపరాలు అయినటువంటి కంది, పెసర మరియు మినుము వంటి పంటలలో ప్రత్యేకంగా నిర్దేశించినబడిన రైజోబియం కల్చర్ ను 200 గ్రాములు ఎకరాకు సరిపోయే విత్తనానికి పట్టించాలి. దీనివలన నత్రజని స్థిరీకరణ పెరిగి అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది. ప్రొద్దుతిరుగుడు

ప్రొద్దుతిరుగుడు లో ఆల్టర్నేరియా ఆకు మచ్చ తెగులు ఆశించే ప్రాంతాల్లో రైతులు ఇపోడియాన్ 25% + కార్బండజిమ్ 25% మందును 2గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి.

దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 315.72 మిలియన్ టన్నులుగా అంచనా : 2020-21లో 4.98 మెట్రిక్ టన్నుల పెరుగుదల

ప్రొద్దుతిరుగుడు

పొదుతిరుగుడు లో ఆలగేరియా ఆకు మచ్చు తెగులు ఆశించే ప్రాంతాలో రైతులు ఇపోడియాన్ 25% + కార్బండజిమ్ 25% మందును 2గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా పంట తొలి దశలో ఆశించే తెల్లదోమ

మరియు పచ్చ దోమ వంటి రసం పీల్చే పురుగుల నివారణకు కిలో విత్తనానికి 5 మీ.లీ ఇమిడాక్లోప్రిడ్ తో విత్తనశుద్ధి చేసుకోవాలి

ఈ విధంగా రైతులు సాగు చేసే పంటలలో తప్పని సరిగా ముందుగా శీలింద్రనాశిని, తరువాత కీటకనాశిని దాని తరువాత జీవ సంబంధమయిన మందులతో విత్తనశుద్ధి చేసి, అదేవిధంగా సకాలంలో సస్య రక్షణ చర్యలను చేపట్టి అధిక దిగుబడులు సాధించగలరు.

తెలంగాణ లో భారీగా పెరగనున్న వరి ఉత్పత్తి !

Authors

ఎమ్. సాయి చరణ్, వై. స్వాతి, బి. సౌందర్య మరియు డా. బి. బాలాజీనాయక్ ప్రాంతీయ  చెరుకు మరియు వరి పరిశోధన స్థానం, రుద్రూర్

Related Topics

Seed purity

Share your comments

Subscribe Magazine