Agripedia

బంతి పూల సాగులో పాటించాల్సిన... సస్యరక్షణ చర్యలు...?

KJ Staff
KJ Staff

వ్యవసాయదారులకు తక్కువ పెట్టుబడితో సంవత్సరం పొడవునా ఆదాయాన్ని సమకూర్చే బంతిపూల సాగును రాష్ట్ర వ్యాప్తంగా అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం బంతి పూల సాగులో పీల్చే పురుగులు, పచ్చదోమ, పేనుబంక ,తెల్లదోమ, తామర పురుగులు వంటి చీడపీడల సమస్య అధికంగా ఉండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.తెగుళ్ల నివారణ పద్ధతులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బూడిద తెగులు : బంతి మొక్క అన్ని భాగాల మీద తెల్లటి పొడి లాంటి పదార్థం కనిపిస్తుంది. దీని నివారణకు నీటిలో కరిగే గంధకం లేదా 1 మి.లీ. డైనోకాప్ లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

పాముపాడ తెగులు: బంతి సాగులో ఈ తెగులు ఎక్కువగా కనిపిస్తుంది. ఆకులపై సర్పిలాకారంలో లేదా పాము వంటి తెల్లటి చారలు కనిపిస్తాయి. వీటి నివారణకు.. డైమిథోయేట్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

తామర పురుగులు: బంతి సాగులో తామర పురుగులు తీవ్ర నష్టం కలిగిస్తాయి.తల్లి, పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగం నుండి రసాన్ని పీల్చడంవల్ల ఆకులు ముడుచుకు పోయి తెల్లటి మచ్చలు ఏర్పడి చివరకు పసుపు రంగులోకి మారి మొక్క చనిపోతుంది.తామర పురుగులు ఆశించిన మొగ్గలు గోధుమ రంగులోకి మారి ఎండిపోతాయి, వీటి నివారణకు ఫిప్రోనిల్ 2 మీ. లీటరు నీటికి కలిపి ఉదయం పూట పిచికారి చేసుకోవాలి.

ఎల్లి పురుగులు : ఈ పురుగులు ఎక్కువగా మొగ్గ దశలో ఆశిస్తాయి. దీనివల్ల ఆకులు పసుపు రంగులోకి మారి క్రిందికి ముడుచుకుంటాయి. వీటి నివారణకు డైకోఫాల్ 5 మి.లీ. లేదా స్పైరోమెసిఫెన్ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

మొగ్గ తొలుచు పురుగు : దీనినే శనగపచ్చ పురుగు అని కూడా అంటారు. వీటి లార్వాలు మొగ్గని తొలిచి తినేస్తాయి.దీనివల్ల పూలు ఆకారాన్ని, నాణ్యతను కోల్పోతాయి. దీని నివారణ ఇండాక్సాకా నోవాల్యురాన్ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

Share your comments

Subscribe Magazine