Education

IB ACIO Recruitment 2022:ఇంటెలిజెన్స్ బ్యూరో లో ఖాళీలు నెలజీతం రూ.44,900 నుండి 1,42,400 వరకు

S Vinay
S Vinay

కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో లో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (Assistant Central Intelligence Officer) పోస్ట్ కొరకై నియామకాలను చేపడుతుంది దీనికి సంబంధించి అధికారక నోటిఫికేషన్ ని కూడా విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలను చదివి దరఖాస్తు చేసుకోగలరు.

IB ACIO Recruitment 2022:మొత్తం ఖాళీల వివరాలు.
మొత్తం ఖాళీలు 150
కంప్యూటర్ సైన్స్ & టెక్నాలజీ - 56 పోస్టులు
ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ - 94 పోస్టులు r or or

IB ACIO Recruitment 2022:విద్యార్హత.
అభ్యర్థులు 2020, 2021 & 2022 లో ఏదైనా సంవత్సరంలో GATE లో ఉతీర్ణత మార్కులు సాధించి ఉండాలి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్(Electronics & Communication) లేదా కంప్యూటర్ సైన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(Computer Science & Information Technology) లేదా కంప్యూటర్ సైన్స్(Computer Science) లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్(Computer Engineering) లేదా కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్‌లో(Computer Science & Engineering) లో ఉతీర్ణత సాధించి ఉండాలి.
లేదా Masters Degree in Science with Electronics or Physics with Electronics or Electronics & Communication or Computer Science or Masters Degree in Computer Applications.

వయోపరిమితి
అభ్యర్థులు 18 నుండి 27 సంవత్సరాల మధ్యలో ఉండాలి.

IB ACIO రిక్రూట్‌మెంట్ 2022: ఎంపిక విధానం
గేట్ మార్కులు & ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. గేట్ స్కోర్ యొక్క వెయిటేజీ 1000 మరియు ఇంటర్వ్యూ 175 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు ఇంటర్వ్యూ ప్రక్రియలో భాగమైన సైకోమెట్రిక్/ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేదీ:
ఆసక్తి గల అభ్యర్థులు 16 ఏప్రిల్ నుండి 7 మే 2022 వరకు ఆన్‌లైన్ మోడ్ ద్వారా పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు.

IB ACIO రిక్రూట్‌మెంట్ 2022: దరఖాస్తు రుసుము
జనరల్/EWS/OBC - రూ. 100/-
SC/ST/మహిళ/మాజీ సైనికుడు - మినహాయింపు.

అధికారిక వెబ్ సైట్ కి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చేయండి www.mha.gov.in

మరిన్ని చదవండి.

NITI Aayog Recruitment 2022:నీతి ఆయోగ్ లో ఖాళీలు నెల జీతం రూ.2,24,100/-

Share your comments

Subscribe Magazine