Education

ICAR Recruitment 2022:ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ లో ఉద్యోగ ఖాళీలు.. నెలజీతం రూ.60,000/-

S Vinay
S Vinay

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (The Indian Council of Agricultural Research) ప్రస్తుతం IT ప్రొఫెషనల్ పోస్ట్ కోసం అర్హులైన అభ్యర్థుల కోసం వెతుకుతోంది. ఆసక్తి ఉన్నవారు క్రింద ఇవ్వబడిన వివరాలను పరిశీలించి, తదనుగుణంగా పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోగలరు.

ICAR Recruitment 2022: విద్యార్హత

అభ్యర్థి CSE/ITలో B.Tech పూర్తి చేసి ఉండాలిమరియు అభ్యర్థి సంబంధిత రంగంలో కనీసం ఆరేళ్ల అనుభవం ఉండాలి.

లేదా కంప్యూటర్ సైన్స్ (Computer Science)/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(Information Technology) / కంప్యూటర్ ఇంజనీరింగ్(Computer Engineering)/MCA/M.Techలో మాస్టర్స్ మరియు సంబంధిత రంగంలో మూడేళ్ల అనుభవంతో తత్సమానంగా ఉండాలి.

లేదా కంప్యూటర్ సైన్స్(Computer Science)/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(Information Technology)/కంప్యూటర్ అప్లికేషన్‌లో( Computer Application) Ph.D. పూర్తి చేసి రెండేళ్ల అనుభవం కలిగి ఉండాలి.

ICAR Recruitment 2022:ఎంపిక విధానం
దరఖాస్తులను స్వీకరించాక అభ్యర్థులను వ్యక్తిగత ఇంటర్వ్యూకి పిలుస్తారు. రాత పరీక్ష కూడా నిర్వహింముచే అవకాశం ఉంది. మార్కుల వెయిటేజీ, సంబంధిత రంగంలో అనుభవం మరియు ఇంటర్వ్యూలో పనితీరు ఆధారంగా అభ్యర్థి ఎంపిక ఉంటుంది.

ICAR Recruitment 2022:వయో పరిమితి
అభ్యర్థులు 21 నుండి 45 సంవత్సరాల మడిలో ఉండాలి.

ICAR Recruitment 2022:IT ప్రొఫెషనల్ జీతం
ప్రారంభంలో, ఎంపికైన అభ్యర్థికి నెలవారీ జీతం రూ. నెలకు 60000.

ICAR Recruitment 2022:దరఖాస్తు చేయడం ఎలా
IT ప్రొఫెషనల్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తమ దరఖాస్తును సూచించిన ప్రొఫార్మాలో
to the Assistant Director-General (PIM), ICAR Headquarters, Krishi Bhawan, New Delhi – 110001. అనే అడ్రస్ కి డాక్యూమెంట్లను పంపగలరు.అంతే కాకుండా sopimicar@nic.in కి ఈమెయిల్ పంపగలరు.

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 12 మే 2022.

మరింత సమాచారం కోసం, అభ్యర్థులు official notification చూడగలరు.  icar.org.in

మరిన్ని చదవండి.

IB ACIO Recruitment 2022:ఇంటెలిజెన్స్ బ్యూరో లో ఖాళీలు నెలజీతం రూ.44,900 నుండి 1,42,400 వరకు

PNB SO RECRUITMENT:పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)లో 145 స్పెషలిస్ట్ ఆఫీసర్ల ఉద్యోగ ఖాళీలు

Share your comments

Subscribe Magazine