Health & Lifestyle

గొంతు మంట తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా?

KJ Staff
KJ Staff

ప్రస్తుతమున్న ఈ కరోనా మహమ్మారి పరిస్థితులలో కొద్దిపాటి సాధారణ జలుబు, దగ్గు,గొంతులో మంటగా ఉన్న ఎన్నో సందేహాలు తలెత్తుతుంటాయి.అయితే ప్రస్తుతం వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల ఈ విధంగా గొంతులో మంట నొప్పి వంటివి కూడా ఏర్పడుతుంటాయి. మరి ఈ విధమైనటువంటి గొంతు మంట తగ్గాలంటే ఏం చేయాలి...ఎలాంటి చిట్కాలను పాటించడం వల్ల గొంతు మంట తగ్గుతుంది ఇక్కడ తెలుసుకుందాం....

*గొంతులో నొప్పి మంట సమస్యతో బాధపడేవారు ముందుగా గోరు వెచ్చని నీటిలోకి కాస్త ఉప్పు కలిపి పుక్కిలించడం ఎంతో ఉత్తమం. ఉప్పు ఒక మంచి యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది. కనుక ఈ విధంగా ఉప్పునీటిని రోజుకు రెండుసార్లు పుక్కిలించడం వల్ల గొంతు మంట నుంచి ఉపశమనం పొందవచ్చు.

*గొంతు నొప్పి మంట సమస్య ఉన్నవారికి తేనె ఒక మంచి ఔషధంగా పనిచేస్తుంది.తేనెలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. రాత్రి నిద్రకి ముందు అర టీ స్పూన్ తాగడం వల్ల గొంతు మంట నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే ఏడాది వయసున్న పిల్లలకు ఈ విధంగా తేనె ఇవ్వకూడదు.

*వాతావరణంలో మార్పుల కారణంగా వచ్చిన గొంతు మంటను తగ్గించుకోవడానికి తేనె ఒక మంచి ఔషధం. మన వంటింట్లో దొరికే మసాలా దినుసులు అంటే లవంగాలు, దాల్చిన చెక్క, పుదీనా ఆకులు, తులసి ఆకులు అల్లం ముక్కలు వేసి బాగా మరిగించి టీ తయారు చేసుకొని తాగడం వల్ల ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

*బాగా జలుబు గొంతులో మంట ఉన్నవారు చికెన్ సూప్ తాగటం వల్ల ఇది మన గొంతులో ఏర్పడిన ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది. అయితే బయట దొరికే సూప్ కాకుండా మనం ఇంట్లో తయారుచేసుకున్న చికెన్ సూప్ తాగడం ఎంతో ఉత్తమం.

*ఒక గోరువెచ్చని నీటిలోకి శుభ్రమైన మెత్తని క్లాత్ వేసి ఆ గుడ్డను బాగా పిండి మెడచుట్టు వేసుకోవటం వల్ల గొంతు నొప్పి, మంట నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు. ఈ చిట్కాలను పాటించడం ద్వారా తొందరగా ఈ గొంతు మంట సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

Share your comments

Subscribe Magazine