Health & Lifestyle

ముంచుకొస్తున్న థర్డ్ వేవ్.. రానున్న రోజులు మరింత కష్టం: వీకే పాల్

KJ Staff
KJ Staff

దేశంలో కరోనా రెండవ దశ తీవ్రస్థాయిలో విజృంభించి ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతుంది.అయితే కరోనా తగ్గుముఖం పడుతుందని ప్రజలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే అందుకు భారీ మూల్యం చెల్లించుకోవడం తప్పదని నీతి అయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. ప్రస్తుతం భారతదేశం కరోనాకు వ్యతిరేకంగా యాంటీ హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించలేదని, రానున్న మరో 125 రోజులు ఎంతో కష్టతరమైనవని అంత వరకు ప్రతి ఒక్కరు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన శుక్రవారం వెల్లడించారు.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ మాట్లాడుతూ..కరోనా వైరస్ వివిధ రూపాలలో సంక్రమించకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కఠినమైన పద్ధతులను అవలంభించాలని ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ రూపంలో వస్తుందని, వాటిని ఎదుర్కోవాలంటే తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరమని ఈ సందర్భంగా వీకే పాల్ తెలిపారు.

ప్రజలు ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా థర్డ్ వేవ్ ముంచుకొస్తుందని, థర్డ్ వేవ్ ను అరికట్టడం కోసం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ఎంతో మంచిదని ఈ సందర్భంగా వీకే పాల్ తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ మాట్లాడుతూ... ఇండోనేషియా, మలేషియా బంగ్లాదేశ్లలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, కరోనా రెండవ దశ కంటే మూడవ దశ అధిక ప్రభావం చూపుతోందని లవ్ అగర్వాల్ ఈ సందర్భంగా తెలిపారు.

Share your comments

Subscribe Magazine