Kheti Badi

పీతల సాగు రైతులను అధికంగా నష్టపరిచే వ్యాధులు, నివారణ చర్యలు...!

KJ Staff
KJ Staff

సముద్ర తీరరేఖ సమృద్ధిగా కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆక్వా రంగ ఉత్పత్తి ఎగుమతుల్లో ప్రముఖ స్థానంలో కొనసాగుతోంది.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో సాగయ్యే ఉప్పునీటి పీతలైన పచ్చపీత ,మండపీతలకు ప్రపంచ మార్కెట్లు అధిక డిమాండ్ ఉండటంతో చాలా మంది చిన్న సన్నకారు ఆక్వా రైతులు వీటి సాగుపై ఆసక్తి కనబరుస్తూ అధిక లాభాలను పొందుతున్నారు.
ప్రస్తుతం మార్కెట్లో ఒక్కకిలో పీతలను 1000 నుంచి1600 వీటి డిమాండ్ని బట్టి కొనుగోలు చేస్తున్నారు.

పీతల సాగులో ఎదురయ్యే వ్యాధులు వాటి నివారణ గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం.
పాకుడు వ్యాధి (ఫాలింగ్): ఈ వ్యాధి చెరువులను ఎండ కట్టకుండా అదే నీటిలో ఎక్కువసార్లు పీతల సాగు చేపడితే వ్యాపిస్తుంది. అలాగే నీటి నాణ్యత లేక పోయినా ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తుంది.
ముఖ్యంగా లీపాస్, బారకిల్స్ మొదలగు బాహ్య పరాన్న జీవులు పీతల శరీరముపై ఆవాసములు ఏర్పరచుకొని పీతల పెరుగుదలకు అడ్డంకిగా మారి వాటి నాణ్యత లోపిస్తుంది.కావున చెరువులో నీటి నాణ్యత ఎప్పటికప్పుడు పరీక్షించి సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి .

బాక్టీరియా వ్యాధులు: పీతల సాగు రైతులను బ్యాక్టీరియా వ్యాధులు అధిక నష్టం కలిగిస్తాయి. ముఖ్యంగా విబ్రియో పారహీమోలైటికస్, విబ్రియో పల్నిఫికస్ మొదలగు బాక్టీరియా జాతులు పీతలగుల్లను గట్టి పడకుండా మెత్తగా ఉండే విధంగా ఎంజైములను విడుదల చేసి పీతల ఆరోగ్యాన్ని క్షీణింపచేస్తాయి. కావున రైతులు నిరంతరం గమనిస్తూ ఉండి సరైన టైంలో గుర్తించి ప్రోబయోటిక్స్ వాడుట వలన సమర్ధవంతంగా నివారించవచ్చు.

మొప్పకుళ్ళు వ్యాధి : ఈ వ్యాధి ప్రధానంగా అధిక సేంద్రీయ పదార్ధములు చెరువు అడుగున పేరుకుపోయినప్పుడు మరియు చెరువు నీటిని ఎక్కువ రోజులు మార్చకుండా అదే నీటిని వాడడం వల్ల, నీటి నాణ్యత తక్కువగా ఉన్నా పీతల్లో మొప్పకుళ్ళు వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి పీతల శ్వాస వ్యవస్థ పై ప్రభావం చూపి ఆక్సిజన్ తీసుకునే సామర్థ్యం తగ్గి చనిపోతాయి.

Share your comments

Subscribe Magazine