Kheti Badi

పత్తి పంటలో గులాబి రంగు పురుగు నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు!

KJ Staff
KJ Staff

ప్రపంచ ఆర్ధిక కార్యకలాపాలలో ప్రధానమైన వాణిజ్య పంటలలో పత్తి పంట ఒకటి. పత్తి పంటను తెల్ల బంగారం అని పిలుస్తారు.అయితే ప్రతి ఏటా పత్తి పంటలో చీడ పురుగు వ్యాప్తి చెందడంతో పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది. గత మూడు సంవత్సరాల కాలం నుంచి గులాబీ రంగు పురుగు ఉధృతి పెరగడంతో తీవ్రమైన పంట నష్టం వాటిల్లుతోంది. అయితే పత్తి పంటలో గులాబీ రంగు పురుగును ఏ విధంగా నివారించాలి?ఈ పురుగు నివారణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

గులాబి రంగు పురుగు ఆశించిన పత్తిని జిన్నింగ్ మిల్లులు దగ్గర, మార్కెట్ వద్ద లేదా రైతులు ఇళ్ల వద్ద ఎక్కువగా నిల్వ ఉంచకూడదు. ఇలా ఉంచడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి అధికంగా జరుగుతుంది. అదేవిధంగా పత్తి పంట పూర్తయిన తర్వాత ఆ పత్తి కట్టెలను పొలం గట్టున వేయకూడదు. అదేవిధంగా వాటిని కాల్చి వేయకూడదు. పత్తి కట్టలను భూమిలో దున్నటం వల్ల అందులో ఉన్నటువంటి గులాబి రంగు పురుగు కోశస్థదశలు నాశనం అవుతాయి.

రైతులు పత్తి పంటను వేసేటప్పుడు వారి ప్రాంతానికి అనువైన దీర్ఘ కాలిక సంకర జాతి రకాల గురించి చర్చింకుని ఎంపిక చేసుకోవాలి. ప్రాంతమంతా ఒకేసారి పత్తి విత్తనాలను నాటుకోవడం వల్ల ఈ పురుగు ఉదృతిని కట్టడి చేయవచ్చు. రైతులు పత్తి విత్తనాలను విత్తేటప్పుడు వివిధ రకాలలో పుష్పించే విత్తనాలను నాటకూడదు. పత్తి పంటను వేసిన పక్కనే బెండ లేదా తుత్తురు బెండ వేసి వాటిలో కలుపు లేకుండా జాగ్రత్తపడాలి.

బీటీ పత్తి నాటేటప్పుడు తప్పనిసరిగా అందులో నాన్ బిటి ప్రత్తిని కూడా నాటాలి. ఇలా చేయటం వల్ల పురుగులు రోగనిరోధకశక్తిని తొందరగా పెంపొందింప చేయదు. పత్తి పంటను వేసిన మొదటి దశలోనే మూడు నుంచి నాలుగు సార్లు పంటకు మోనోక్రోటోఫాస్ + ఎసిఫేట్ పిచికారీ చేయడం వల్ల ఆకు పచ్చని ఆకులు ఎక్కువై పూత ఆలస్యంగా వస్తుంది. పూత, కాత ఒకే సమయంలో రాకపోవటం వల్ల పురుగుకి నిరంతర ఆశ్రయం ఉండి పురుగు ఉధృతి పెరుగుతుంది. ఈ విధమైనటువంటి నివారణ చర్యలు తీసుకున్నప్పుడు పత్తి పంటలో గులాబీ రంగు పురుగు ఉధృతి తగ్గి రైతుకు అధిక దిగుబడి కలుగుతుంది.

Share your comments

Subscribe Magazine