News

ఏపీ రైతులకు అలర్ట్..ఈ- కేవైసీ చేస్తేనే రైతు భరోసా డబ్బులు

Srikanth B
Srikanth B
ఏపీ రైతులకు అలర్ట్..ఈ- కేవైసీ చేస్తేనే రైతు భరోసా డబ్బులు
ఏపీ రైతులకు అలర్ట్..ఈ- కేవైసీ చేస్తేనే రైతు భరోసా డబ్బులు

ఆంధ్రప్రదేశ్రైతులకు ప్రభుత్వం సూచనలను జారీ చేసింది , తదుపరి విడత రైతు భరోసా డబ్బులు నేరుగా రైతుల ఖాతాలో జమ కావాలంటే రైతులు ekyc ప్రక్రియ పూర్తి చేయాలనీ రైతులను ఆదేశించింది . లేనిపక్షంలో రైతుల ఖాతాలో తదుపరి విడత రైతు భరోసా డబ్బులు జమ కావని సూచించింది.

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో 3.13 లక్షల రైతుల ఖాతాలు ఈ-కేవైసీలు పెండింగ్ లో ఉన్నాయని… వాటిని త్వరగా పూర్తిచేయాలని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.


పీఎం కిసాన్ డబ్బులతో కలిపి రైతు భరోసా ఇస్తున్న ప్రభుత్వం ప్రతి విడతకు ఈ-కేవైసీ ఉంటేనే రైతులకు నిధులు విడుదల చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో ఈ నెలాఖరు లోగా రైతుల బ్యాంకు ఖాతాలకు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్లకు సిఎస్ సూచించారు. ఇప్పటివరకు 38.56 లక్షల మంది రైతుల ఖాతాలకు ఈ-కేవైసీ పూర్తయింది. మిగిలిన రైతుల ekyc ప్రక్రియ పూర్తి చేయాలనీ ఆదేశాలు జారీ చేసారు.

తదుపరి విడత రైతుభరోసా ఎప్పుడు ?

సంవత్సరానికి మూడు సార్లు అందించే రైతు భరోసా .. రైతు భరోసా తదుపరి విడత అక్టోబర్ లేదా నవంబర్ నెలలో రైతుల ఖాతలో జమ చేసే అవకాశం ఉంటుంది.

ఆరోగ్య శ్రీ వైద్య సాయం రూ. 5 లక్షలకు పెంపు .. eKYC చేసుకున్న వారికే

Related Topics

YSR raithu barosa

Share your comments

Subscribe Magazine