News

దశాబ్దాల నాటి సుగందద్రవ్యాల ,రబ్బర్ చట్టాలను రద్దు చేయమని వాణిజ్య మంత్రిత్వ శాఖ సూచించింది

Srikanth B
Srikanth B

టీ, కాఫీ, సుగంధ ద్రవ్యాలు మరియు రబ్బర్ కు సంబంధించిన దశాబ్దాల నాటి చట్టాలను రద్దు చేయాలని మరియు కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది ,ఈ రంగాల అభివృద్ధి ని ప్రోత్సహించడానికి మరియు వ్యాపారం లో స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

 

ప్రతిపాదించిన బిల్లులు :

స్పైసెస్ (ప్రమోషన్ అండ్ డెవలప్ మెంట్) బిల్లు, 2022, రబ్బర్ (ప్రమోషన్ అండ్ డెవలప్ మెంట్) బిల్లు, 2022, కాఫీ (ప్రమోషన్ అండ్ డెవలప్ మెంట్) బిల్లు, 2022, టీ (ప్రమోషన్ అండ్ డెవలప్ మెంట్) బిల్లు, 2022 ముసాయిదాలపై ఆయా శాఖల నుంచి మంత్రిత్వ శాఖ అభిప్రాయాన్ని కోరింది . ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ఈ నాలుగు ముసాయిదా బిల్లులపై అభిప్రాయం తెలపడానికి  ప్రజలు మరియు వాటాదారులను ఆహ్వానించారు.

1953 టీ చట్టం, 1986 స్పైసెస్ బోర్డు చట్టం, 1947 రబ్బర్ చట్టం, 1942 కాఫీ చట్టాన్ని నాలుగు వేర్వేరు కార్యాలయ మెమోరాండం లను రాదు చేస్తూ వాణిజ్య శాఖ ప్రతిపాదించింది .వాణిజ్య మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్న ముసాయిదా బిల్లుల ప్రకారం, "ఈ  "రద్దు చేసి, ప్రస్తుత వాస్తవాలు మరియు లక్ష్యాలను ప్రతిబింబించేలా కొత్త చట్టాన్ని అమలు చేయాలని ప్రతిపాదించబడింది."

టీ చట్టాన్ని రద్దు చేయాలని ప్రతిపాదించడానికి ప్రధాన కారణం ఒకప్పటి టీ సాగు మార్కెటింగ్ విధానం మారడం , అయినప్పటి  ఒకప్పటి చట్టాలను వినియోగిస్తుండడం . 

"చట్టపరమైన పాలన ఉత్పత్తి మద్దతు, నాణ్యత మెరుగుదల, టీ ప్రమోషన్ మరియు టీ పెంపకందారు నైపుణ్యఅభివృద్ధి వంటి ఆధునిక అంశాలు టీ బోర్డు లో చేర్చబడాలి అని అభిప్రాపడింది . 

స్పైసెస్ (ప్రమోషన్ అండ్ డెవలప్ మెంట్) బిల్లు, 2022 ప్రకారం, స్పైసెస్ బోర్డు మొత్తం మసాలా రవాణాలపై  దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.సుగంధ ద్రవ్యాల రంగంలో అభివృద్ధి చెందుతున్న నాణ్యత మరియు ఆహార భద్రతా ఆవశ్యకతలు,  సుగంధ ద్రవ్యాల ఆధునిక మార్పులు  దృష్టిలో ఉంచుకొని, ఈ సమస్యలను పరిష్కరించడానికి సుగంధ ద్రవ్యాల పరిశ్రమకు పరిశోధన మద్దతును నిర్దేశించడం చాలా ముఖ్యమని ముసాయిదా బిల్లు పేర్కొంది.ఇంకా చట్టం లో ఏ నాడు ఉప్పయోగించని నిబంధనలను తొలగించి ,కొత్తవాటిని జోడించాలని పేర్కొంది . 

Share your comments

Subscribe Magazine