News

MFOI సంరిధి కిసాన్ ఉత్సవం 2024: బారామతి, పూణే మహారాష్ట్ర.

KJ Staff
KJ Staff

మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా 2024, ఈ మార్చ్ నెలలో అనేక రాష్ట్రాల్లో నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమం, ఇప్పుడు పూణే బారామతి కృషి విజ్ఞాన్ కేంద్రం వేదికగా జరుగుతుంది. రైతులకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు ఈ కార్యక్రమంలో చోటుచేసుకోనున్నాయి.

వ్యవసాయంలో విశేష కృషి చేసి, వ్యవసాయం ద్వారా లక్షల్లో ఆదాయాన్ని ఆర్జిస్తున్న రైతులను మిల్లియనీర్ ఫార్మర్స్ గా పరిగణిస్తారు. అటువంటి లక్షాధికారి రైతులకు మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా(MFOI) బిరుదుతో సత్కరించి వారిని సన్మానించడానికి ప్రారంభించినవే సంరిధి కిసాన్ ఉత్సవాలు. ఈ ఉత్సవాల్లో రైతులకు అవార్డులను అందచేయడంతో పాటు, వ్యవసాయ కంపెనీలు, తమ ఉత్పత్తులను, ప్రదర్శనలో ఉంచి కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ వాటి ఉపయోగాలని రైతులకు వివరిస్తారు. తద్వారా రైతులు వారి వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా కంపనీల నుండే కొనుగోలు చెయ్యచ్చు.

ఇప్పుడు ఈ కార్యక్రమం మహారాష్ట్ర, పుణెలోని, బారామతి కృషి విజ్ఞాన్ కేంద్రం లో జరుగుతుంది. ఈ కార్యక్రమినికి, కృషి విజ్ఞాన్ కేంద్రం, శాస్త్రవేత్తలతో పాటు, కొన్ని ప్రముఖ అగ్రిటెక్ కంపెనీలు కూడా విచ్చేసాయి. కార్యక్రమంలో మొదట బారామతి FPCL FPO స్థాపించిన, ప్రహ్లద్ వారే, అతని విజయ గాధను రైతులతో పంచుకున్నారు. అనంతరం, చెరుకు రైతులు ప్రధానంగా ఎదురుకునే, చీడ పీడల గురించి మరియు వాటి యాజమాన్య పద్దతుల గురించి, డా. మిలింద్ జోషి రైతులకు స్పష్టంగా వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య స్పాన్సర్ దనుక అగ్రిటెక్ ప్రైవేట్ తరపున అక్కడి ఏరియా సేల్స్ మేనేజర్ రాహుల్ దేశముఖ్ విచ్చేసి రైతులకు, ధనుక అగ్రిటెక్ కంపెనీ వారి ఉత్పత్తుల గురించి రైతులకు తెలియపరిచారు.

Read More:

MFOI సంరిది కిసాన్ ఉత్సవం 2024: గోరఖ్పూర్, ఉత్తర్ ప్రదేశ్.

10 పరీక్షలకు విద్యార్థులు సంసిద్ధం:

చిరుధాన్యాల సాగు ద్వారా వచ్చే లాభాల గురించి అలాగే వాటి యాజమాన్య పద్దతుల గురించి రైతులకు అవగాహన కల్పించడానికి, కేవీకే శాస్త్రవేత్త, సంతోష్ కరాంజె ప్రసంగించారు. మరొక్క ప్రత్యేక విషయం ఏమిటంటే సుజుకి కంపెనీ వారు వారి కార్లను ప్రదర్శనలో ఉంచారు. అలాగే వ్యవసాయంలో కుత్రిమ మీద శక్తీ ఎలా ఉపయోగపడబోతుందో, కృషి విజ్ఞాన్ కేంద్రం సీనియర్ సైంటిస్ట్ ధీరజ్ షిండే రైతులకు తెలియచేసారు. బారామతి అగ్రి ఆఫీసర్, సుప్రియ బండల్, ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టిన కొత్త స్కీమ్స్ గురించి వివరించారు.

చివరిగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమైన అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. MFOI అవార్డులతో పాటు ధనుక అగ్రిటెక్ లిమిటెడ్ వారు మిల్లియనీర్ ఫార్మర్స్ కు బహుమతులను అందచేశారు. రైతులు అనేక కొత్త విషయాలు తెలుసుకునేందుకు, మరియు వారి అనుభవాలను, ఒకరితో ఒకరు పంచుకోవడానికి ఈ కార్యక్రమం ఒక మంచి వేదికగా నిలిచింది.

Share your comments

Subscribe Magazine