News

గ్రామీణ మహిళల్లో పోషకాహార లోపంపై అవగాహన కు 5000 మహిళల ర్యాలీ నిర్వహణ !

S Vinay
S Vinay

గ్రామీణ మహిళల్లో పోషకాహార లోపం, రక్తహీనత మరియు తక్కువ జనన శిశువులపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ క్యాంపెయిన్ కింద గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (MORD) ఐకానిక్ వీక్ వేడుకల్లో భాగంగా ‘కుపోషన్ సే ఆజాదీ’ ర్యాలీలను నిర్వహించింది. ఇందులో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (DDU-GKY) మరియు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలు (RSETI) రెండింటి నుండి సుమారుగా 5000 మందికి పైగా దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించారు.

రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్లు, ఆర్‌ఎస్‌ఇటిఐలు, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీలు (పిఐఎలు) వంటి విభాగాలకు సంబందించిన అభ్యర్థులు ఇందులో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ర్యాలీలో భాగంగా మహిళా అభ్యర్థులు సందేశాత్మక ప్లకార్డులు, పోస్టర్లు పట్టుకుని గ్రామాల్లో సైకిల్‌పై మరియు పాదయాత్ర చేస్తూ ప్రచారాన్నిపటిష్టంగా చేపట్టారు.
భారత దేశ గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న మహిళలు ఇప్పటికి పోషకాహార లోపం, రక్తహీనత వంటి వాటితో ఎక్కువగా బాధపడుతున్నారు ఇవి మరిన్ని అనారోగ్య సమస్యలకి దారి తీస్తున్నాయి వీటిపై సరైన అవగాహన పెంచడమే లక్ష్యముగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం

దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (DDU-GKY) గురించి తెలుసుకుందాం :
ఈ పథకం 25 సెప్టెంబర్, 2014న ప్రారంభించబడింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (MORD) ద్వారా నిధులు లభిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో గల పేద యువతకి శిక్షణ ఇచ్చి వారి నైపుణ్యాలను పెంచి వివిధ రంగాలలో ఉపాధిని కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శిక్షణ పొందిన వారిలో కనీసం 70 శాతం అభ్యర్థులకు నియామకాలు జరిగేల ఈ పథకం ద్వారా ప్రభుత్వం హామీ ఇస్తుంది.

మరిన్ని చదవండి

ఆంధ్రప్రదేశ్ 2022-23 వ్యవసాయ,అనుబంధ రంగాలకి వార్షిక బడ్జెట్ రూ. 43,053 కోట్ల కేటాయింపు . వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం చేస్తూ పెద్ద పీఠ

స్పైసెస్ బోర్డ్ లో వివిధ ట్రైనీ పోస్టులకు సంబంధించి నియామకాలు స్టైపెండ్ నెలకి రూ 21000 పొందండి

Share your comments

Subscribe Magazine