News

30 లక్షల టన్నుల వరిని కొనుగోలు చేసిన తెలంగాణ ప్రభుత్వం!

S Vinay
S Vinay

తెలంగాణ లో వరి కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతుంది, అయితే ఈ కొనుగోళ్లు జూన్ 10 నాటికి ముగియనున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 4.72 లక్షల మంది రైతుల నుంచి రూ.5,888 కోట్ల విలువైన 30.1 లక్షల మెట్రిక్ టన్నుల వరిని ప్రభుత్వం కొనుగోలు చేసింది.యాసంగి సీజన్‌లో తెలంగాణ రాష్ట్రం నుంచి వరిధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్రం నిరాకరించినప్పటికీ, మిగులు బియ్యం నిల్వలు ఉన్నాయని పేర్కొంటూ, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు రైతుల నుండి మొత్తం వరిని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. తొలుత 50 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి 65 లక్షల మెట్రిక్‌ టన్నులు సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మిగిలిన వరి ధాన్యాన్ని బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు.కేంద్రం సహకారం లేకుండా పూర్తిగా ధాన్యం కొనుగోలు చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.3000 కోట్ల నష్టం వాటిల్లుతుందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల తడిసిన సుమారు 10,000 మెట్రిక్ టన్నుల వరి, ఎండిపోయిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన రైతుల నుంచి కూడా కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన వెంటనే ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలిస్తున్నారు. రాష్ట్రంలో ప్రారంభించిన మొత్తం 6,544 కొనుగోలు కేంద్రాల్లో దాదాపు 5,000 వరి సేకరణను ఇప్పటికే పూర్తి చేశామని, కొన్ని జిల్లాల్లో వారి సేకరణ ప్రక్రియ చివరి దశలో ఉందని జిన్ 10 నాటికి కొనుగోళ్లు ముగుస్తాయని మంత్రి తెలిపారు.

అయితే తెలంగాణ ప్రభుత్వం రాబోయే 2022-23 వానకాలం (ఖరీఫ్) పంటల సీజన్‌లో వరికి ఇతర ప్రత్యామ్నాయ పంటలను పండించేలా రైతులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం తన యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తోంది.

మరిన్ని చదవండి.

Aadhar card update: ఇప్పుడు పోస్టాపీసులో ఆధార్ కార్డు అప్ డేట్ సేవలు

మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా లేక పాకిస్థాన్ ఉన్నామా?

Share your comments

Subscribe Magazine