News

పచ్చి రొట్టె ఎరువులతో రైతులకు ఎన్నో ప్రయోజనాలు?

KJ Staff
KJ Staff

సాధారణంగా రైతులు పంట వేసే ముందు పంట దిగుబడి కోసం ఎన్నో ఎరువులు వేస్తుంటారు. ఈ విధంగా అధిక పంట దిగుబడి పొందడానికి ఎక్కువగా రసాయన ఎరువులను ఉపయోగించడం వల్ల పంట దిగుబడి క్రమంగా తగ్గిపోతుంది. ఇందుకు గల కారణం అధిక రసాయన ఎరువులు ఉపయోగించడం వల్ల నేల సారవంతం కోల్పోయి క్రమంగా పంట దిగుబడి తగ్గుతుంది.ఈ క్రమంలోనే రైతులు తక్కువ ఖర్చుతో అధిక లాభాలను పొందటానికి పచ్చిరొట్టల ఎరువులు ఎంతో అనువైనదని చెప్పవచ్చు.

ఈ విధంగా పచ్చిరొట్ట ఎరువులు భూమిలో వేయడం వల్ల భూమి సారవంతం అవ్వడమే కాకుండా కలుపు మొక్కలను నిర్వహిస్తూ రైతులకు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడిని అందిస్తుంది.ముఖ్యంగా వరి పంటను సాగు చేసే రైతులు వరి వేయడానికి ముందుగా వారి పొలాలలో పచ్చిరొట్ట సాగు చేయడం వల్ల భూమి ఎంతో సారవంతం అవుతుంది.ఈ క్రమంలోనే రైతులు ఈ విధంగా పచ్చిరొట్ట , జీలగ సాగు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.వ్యవసాయ శాఖ కృషితో ఏటా పచ్చిరొట్ట సాగు క్రమంగా పెరుగుతోంది.

ఈ సాగు చేయడానికి వర్షాకాలం ఎంతో అనువైనది. ఈ పచ్చ రొట్టెను సాగు చేసి నెల రోజుల తర్వాత భూమిలో కలియ దున్నటం వల్ల భూమి ఎంతో సారవంతం అవుతుంది.ఎకరాకు 12-14 కిలోల విత్తనాలను పొలంలో చల్లుకోవాలి. 20 నుంచి 30 రోజులలోగా ఈ పంటను భూమిలో కలియదున్నాలి. ఈ విధంగా చేయటం వల్ల సేంద్రియ ఎరువులు అందులో ఉన్నటువంటి పోషకాలు మొక్కకు సరైన మోతాదులో అందుతాయి. అంతేకాకుండా కలుపు మొక్కల నివారణ కూడా తగ్గుతుంది.ఈఏడాది వ్యవసాయ శాఖ ద్వారా విత్తనాలను రాయితీ అందించడంతో రైతులు కూడా ఈ పంటను సాగు చేయడానికి ఇష్టపడుతున్నారు .

Share your comments

Subscribe Magazine