News

Ration update :కుటుంబం లో ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యం !

Srikanth B
Srikanth B
కుటుంబం లో ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యం !
కుటుంబం లో ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యం !

తెలంగాణలో ఉచిత రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేయనుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 5 కిలోలకు మరో ఐదు కిలోలు కలిపి ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యాన్ని పంపిణీ చేయనుంది.

అంతమందికి 10 కిలోల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు.

సాంకేతిక కారణాలతోనే ఏప్రిల్, మే నెలల్లో ఉచిత రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయలేకపోయామని మంత్రి గంగుల తెలిపారు. ఈ నెల 18 నుంచి 26 వరకు ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ఉంటుందన్నారు.

కరోనా కాలంలో పేద ప్రజలను ఆదుకునేందుకు ఏప్రిల్, 2020న కేంద్రం ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది.ప్రస్తుత సంవత్సరంలో మార్చి నెల నుంచి మరో ఆర్నెళ్ల పాటు ఈ పథకాన్ని అమలుచేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది.

గరీబ్ కల్యాణ్ అన్న యోజనా పథకం కింద అర్హులైన పేదలందరికీ ఉచిత బియ్యం అందించనున్నారు. అర్హులైన లబ్దిదారులకు ఈ పథకం ద్వారా 5 కిలోల చొప్పున బియ్యాన్ని ఉచితంగా అందించింది. కరోనా కారణంగా వరుస లాక్‌డౌన్‌లు పెట్టాల్సిన పరిస్థితి రావడంతో ఈ పథకాన్ని కేంద్రం పొడగిస్తూ వచ్చింది.

రేషన్ కార్డు లో కొత్త నియమం ఇక నుండి ఆ సమస్య ఉండదు!

కేంద్రం తమ కోటా కింద ఇచ్చే 5 కిలోలకు మరో 5 కిలోలు కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలుచేయనుంది. ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ద్వారా రాష్ట్రంలో దాదాపు 2.87 కోట్ల మందికి లబ్ది చేకూరనుంది.

పడిపోయిన టమాటా ధర...ఒక బాక్సు ధర ఎంతో తెలుసా

Share your comments

Subscribe Magazine