Education

ప్రపంచ బాలల దినోత్సవం 2022: జాతీయ బాలలదినోత్సవం మరియు ప్రపంచ బాలల దినోత్సవానికి మధ్య ఇదే తేడా ..

Srikanth B

ప్రపంచ బాలల దినోత్సవం 2022 : పిల్లల యొక్క హక్కులను గుర్తించి కాపాడాలనే ఉదేశ్యం తో ప్రపంచ దేశాలు ప్రతి సంవత్సరం నవంబర్ 20 న ప్రపంచ బాలల దినోత్సవాన్ని జరుపుకుంటాయి . అయితే 2022 నవంబర్ 20 నాడు UNICIF "inclusion of every child" అనే థీమ్ తో ప్రపంచ బాలల దినోత్సవాన్ని ప్రపంచం జరుపుకోనున్నది . "inclusion of every child" ముఖ్య ఉద్దేశం కుల ,మత , వివక్షలకు వ్యతిరేకముగా ప్రపంచ వ్యాప్తముగా ఎటువంటి వివక్షకు పిల్లలు గురి కాకుండా చూడడం దీనియొక్క ముఖ్య ఉద్దేశం .

ప్రపంచ బాలల దినోత్సవం 2022 నవంబర్ 20 న ఎందుకు జరుపుకుంటారు ?

1857లో, డాక్టర్ చార్లెస్ లియోనార్డ్ యునైటెడ్ కింగ్‌డమ్‌లో రోజ్ డే అనేపేరుతో మొదట ఈరోజును ప్రారంభించారు . 1920లో, రిపబ్లిక్ ఆఫ్ టర్కీ అధికారికంగా బాలల దినోత్సవాన్ని గుర్తించి జాతీయ సెలవు దినంగా ప్రకటించింది . 1950లో, చాలా దేశాలు జూన్ 1ని "పిల్లల రక్షణ దినోత్సవం"గా జరుపుకోవడం ప్రారంభించాయి.

1954లో ఐక్యరాజ్యసమితి నవంబర్ 20వ తేదీని " యూనివర్సల్ చిల్డ్రన్స్ డే "పేరుతో గుర్తించింది . UN జనరల్ అసెంబ్లీ అన్ని దేశాలు బాలల హక్కులు, ఐక్యత మరియు పిల్లల సంక్షేమం గురించి అవగాహనను పెంపొందించడానికి పిల్లల కోసం ఒక రోజును కేటాయించాలని నిర్ణయించింది . అయితే నవంబర్ 20, 1959న, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ బాలల హక్కుల ప్రకటనను ఆమోదించింది మరియు నవంబర్ 20, 1989న UN జనరల్ అసెంబ్లీ బాలల హక్కుల ఒప్పందాన్ని ఆమోదించింది . దీనితో ప్రతి సంవత్సరం మనం ప్రపంచ బాలల దినోత్సవం 2022 బాలల దినోత్సవాన్ని జరుపుకుంటాము .

నవంబర్ 11 జాతీయ విద్య దినోత్సవం థీమ్ ఏంటో తెలుసా !

జాతీయ బాలలదినోత్సవం మరియు ప్రపంచ బాలల దినోత్సవానికి మధ్య తేడా :

నవంబర్ 14 ప్రతి ఏటా నవంబర్ 14 న దివంగత భారత దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భముగా , అయన పిల్లల పై చూపిన ప్రేమకు గుర్తుగ జాతీయ బాలల దినోత్సవం జరుపుకుంటాం. అయితే దీని భిన్నంగా ప్రపంచ వ్యాప్తముగా 20 నవంబర్ ను ప్రపంచ బాలల దినోత్సవంగా జరుపుకుంటాము .

నవంబర్ 11 జాతీయ విద్య దినోత్సవం థీమ్ ఏంటో తెలుసా !

Share your comments

Subscribe Magazine