Health & Lifestyle

అపెండిసైటిస్ ను 24 గంటల కడుపు నొప్పి అని ఎందుకంటారో తెలుసా?

KJ Staff
KJ Staff

ఈ రోజుల్లో చాలా మంది బాధపడే వ్యాధులలో అపెండిసైటిస్ అనే వ్యాధి ఒకటి. ఈ అపెండిసైటిస్ వల్ల కలిగే దుష్పరిణామాలు చాలా ఉన్నాయి. అపెండిసైటిస్ కు వెంటనే శస్త్ర చికిత్స చేయకపోతే చనిపోయే ప్రమాదం ఉంది. అందుకోసమే ఈ సమస్యతో బాధపడే వారిలో తీవ్రమైన కడుపు నొప్పి ఉంటుంది. అందుకే ఈ సమస్యతో బాధపడే వారిలో 24 గంటల లోగా చికిత్స చేయాలని వైద్యులు చెబుతుంటారు.

అపెండిసైటిస్ అనేది వయస్సు వ్యత్యాసం లేకుండా ఏ వయసు వారికైనా వచ్చే సమస్య. ముఖ్యంగా అపెండిసైటిస్ అనేది 10 నుండి 30 సంవత్సరాల వయస్సు గల వారికి వచ్చే సమస్య. అపెండిక్స్ అనేది మన శరీరంలో పెద్ద ప్రేగుతో అనుసంధానమైన ఒక చిన్నని గొట్టం లాంటి సంచి.ఇది మన శరీరంలో పొత్తి కడుపు క్రింద కుడివైపుగా ఉంటుంది.ఇది ఎర్రగా మారి వాపు రావడం వల్ల అపెండిసైటిస్ వస్తుంది. దీని వల్ల పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి పుడుతుంది. దీనినే 24 గంటల కడుపు నొప్పి లేదా అపెండిసైటిస్ అని కూడా అంటారు.

అపెండిక్స్ లో సన్నని గొట్టంలో ఆహార పదార్థాలు లేదా ఏదైనా మలినాలు చేరటం వల్ల ఈ అపెండిసైటిస్ వస్తుంది. అపెండిసైటిస్ తో బాధపడేవారు తీవ్రమైన కడుపు నొప్పి మరియు విరేచనాలు మరియు జ్వరం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఇటువంటి సమయంలో అపెండిసైటిస్ ను అదుపు చేయటం చాలా అవసరం. ఈ అపెండిసైటిస్ అనే వ్యాధి మొదట సాధారణం కడుపు నొప్పిగా అనిపిస్తుంది. దానిని మొదట గుర్తించలేరు తరువాత అది చాలా తీవ్రమైన కడుపునొప్పిని కలిగిస్తుంది.

ఈ అపెండిసైటిస్ కు వెంటనే సర్జరీ చేయటం చాలా అవసరం. అపెండిసైటిస్ కు వెంటనే సర్జరీ చేయకపోతే ఆ నాళం పగిలి దానిలోని మలినాలు మరియు వ్యర్థ పదార్థాలు కడుపులోకి చేరి అక్కడ కూడా వాపును కలుగజేసి "పెరిటోనైటిస్" అనే సమస్యకు దారితీస్తుంది కనుక 24 గంటలలో సర్జరీ ద్వారా తొలగించాలని వైద్యులు సూచిస్తారు.

Share your comments

Subscribe Magazine