Health & Lifestyle

మీకు నెయ్యి తినే అలవాటు లేదా..ఈ ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోవాల్సిందే!

Srikanth B
Srikanth B

సాధారణంగా చాలామందికి నెయ్యి తినే అలవాటు ఉంటుంది. ఎలాంటి ఆహార పదార్థాలు చేసిన అందులోకి నెయ్యి వేసుకుని తింటూ ఉంటారు. కానీ మరికొందరికి మాత్రం నెయ్యి తినడం ఏ మాత్రం ఇష్టం ఉండదు. నెయ్యిని ప్రతిరోజు తీసుకోవటం వల్ల అధిక శరీర బరువు పెరుగుతారని చాలామంది నెయ్యిని తినడానికి వెనకడుగు వేస్తారు. ఈ విధమైనటువంటి ఆలోచనలతో నెయ్యిని దూరం పెడితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. నెయ్యి తినడం వల్ల ఏ విధమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం...

సహజసిద్ధంగా మన ఇంటిలో తయారు చేసుకున్న నెయ్యిలో అధికమొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.యాంటీఆక్సిడెంట్లు దగ్గు, జలుబు, ఫ్లూ వంటి వ్యాధులతో పోరాడటానికి అవసరం అయ్యే రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి దోహదపడుతుంది. నెయ్యి తినే అలవాటు లేకపోతే మన శరీరంలో రోగనిరోధక శక్తిని కోల్పోవలసి వస్తుంది. తద్వారా అనేక వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి.

శుభవార్త :వంటనూనె లీటర్ కు 15 రూపాయలు తగ్గించాలని ఆదేశించిన కేంద్రం

తరచూ నెయ్యి తినడం వల్ల జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. నెయ్యి ఉన్నటువంటి పదార్థాలు ఆలోచన శక్తిని మెరుగుపరుస్తాయి. అదేవిధంగా జీర్ణక్రియను మెరుగుపరచడంలో కణాల అభివృద్ధికి నెయ్యి ఎంతగానో దోహదం చేస్తుంది.నెయ్యిలో సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన ఫ్రీరాడికల్స్ ను బయటికి తొలగించి మన చర్మాన్ని ఎంతో యవ్వనంగా కాంతివంతంగా ఉంచుతుంది. అదేవిధంగా ఇది ఒక నేచురల్ మాయిశ్చరైజర్ గా కూడా ఉపయోగపడుతుంది. నెయ్యిలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు ఉండటం వల్ల ఇది మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి శరీర బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అయితే రోజుకు తగిన పరిమాణంలో మాత్రమే తీసుకోవడం వల్ల ఈ విధమైనటువంటి ప్రయోజనాలను పొందవచ్చు.

పంటలను రక్షించుకుంనేందుకు కొత్త టెక్నాలజీ !

Share your comments

Subscribe Magazine