Health & Lifestyle

పుట్ట‌గొడుగులను తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు !

Gokavarapu siva
Gokavarapu siva
Health benefits of   Mushroom
Health benefits of Mushroom

పుట్ట‌గొడుగులు ప్ర‌యోజ‌నాల పుట్ట‌. పుట్ట‌గొడుగుల్లో స‌హ‌జ పోష‌కాలు ఎక్కువ‌గా ఉంటాయి. శాకాహారమైన ఈ పుట్టగొడుగుల్లో పోషకాలు మెండుగా ఉంటాయి. మాంసంహారం తిన‌ని వాళ్లు పుట్ట‌గొడుగులను తప్పనిసరిగా తమ ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది. మాంసాహారం ద్వారా పొందే ప్ర‌యోజ‌నాల‌న్నీ పుట్టగొడుగుల ద్వారా పొంద‌వ‌చ్చు.

  • శరీరానికి కావాల్సిన మాంస‌కృత్తులు పుట్టగొడుగుల ద్వారా శ‌రీరానికి ల‌భిస్తాయి. అంతేకాదు పుట్టగొడుగుల్లో పలు రకాల దీర్ఘకాలిక వ్యాధులు నయం చేసే సత్తా కూడా దాగుంది.
  • విట‌మిన్ డి మనకు సహజం గా సూర్య రశ్మి నుండి లభిస్తుంది. ఆహార పరంగా పుట్ట గొడుగులలో మాత్రమే విట‌మిన్ డి స‌మృద్ధిగా ఉంటుంది. దీన్ని త‌ర‌చుగా తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు, దంతాలు గ‌ట్టిప‌డ‌తాయి. దీని వలన రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది.
  • ఇందులో ఉండే విట‌మిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి, పాంటోథెనిక్ ఆమ్లము మరియు నియసీన్లు న‌రాల ఆరోగ్యానికి స‌హాయ‌ప‌డుతుంది.
    పుట్ట‌గొడుగుల్లో ఉండే కాప‌ర్ ఎర్ర‌ర‌క్త‌క‌ణాల ఉత్ప‌త్తికి తోడ్ప‌డుతుంది. పుట్ట గొడుగులలో ఉండే రాగి శరీరానికి అవసరమైన ప్రాణ వాయువును అందేలా చేస్తుంధి.
  • జీర్ణక్రియకు పుట్ట‌గొడుగుల్లో ఉండే పీచు ప‌దార్థం, ఎంజైమ్స్ శ‌రీరంలో కొలెస్ర్టాల్ స్థాయిలను త‌గ్గిస్తాయి. జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ని మెరుగుప‌ర‌చ‌డానికి పుట్ట‌గొడుకులు స‌హాయ‌ప‌డ‌తాయి.
  • అనీమియాతో బాధ‌ప‌డే వారికి ర‌క్తంలో ఐర‌న్ త‌క్కువ‌గా ఉంటుంది. ఫ‌లితంగా త‌ల‌నొప్పి, ఆయాసం, నాడీవ్య‌వ‌స్థ‌, జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లో స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. ఈ వ్యాధితో బాధ‌ప‌డే వాళ్లు ఐర‌న్ ఎక్కువ‌గా ఉండే పుట్ట గొడుగులు తీసుకోవ‌డం మంచిది.
  • బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి పుట్ట‌గొడుగులు మంచి పరిష్కారం. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల కొవ్వులు క‌రిగి ప్రొటీన్లు జీర్ణ‌మ‌వ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది. ఇలా ఈజీగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు.
  • ఇది కూడా చదవండి .

    నల్ల బియ్యం తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలు ..

  • మ‌ష్రూమ్స్ లో 80 నుంచి 90 శాతం వ‌ర‌కు నీటి శాతం ఉంటుంది. శ‌రీరానికి నీటి శాతం ఎంత ఎక్కువ‌గా అందితే అంత మంచిది. స‌గం క‌ప్పు పుట్ట‌గొడుగుల్లో కేవ‌లం 9 క్యాలరీలే ఉంటాయి. అలాగే ఉడికించిన వాటిలో 21 క్యాల‌రీలు ఉంటాయి. కాబ‌ట్టి వీటిని తీసుకోవ‌డం వల్ల కొవ్వు స్థాయిలు త‌గ్గుతాయి.
  • యాంటీ ఆక్సిడెంట్స్ మ‌ష్రూమ్స్ లో ఎర్గోథియోన్ వంటి శ‌క్తివంత‌మైన ఎమినో యాసిడ్ యాంటీ ఆక్సిడెంట్ గా ప‌నిచేస్తాయి. అలాగే ప్రీరాడిక‌ల్స్ నుంచి ర‌క్ష‌ణ‌నిస్తుంది. దాంతోపాటు వ్యాధినిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది.
  • డ‌యాబెటిస్ తో బాధ‌ప‌డుతున్న వారికి ఇది ఆహారం. కొలెస్ర్టాల్, కార్బొహైడ్రేట్స్ త‌క్కువ‌గా, ప్రొటీన్స్, శ‌రీరానికి కావాల్సిన విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ పుష్క‌లంగా ఉంటాయి. నీళ్లు, పీచుప‌దార్థాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఇందులో ఉండే కొన్ని ఎంజైమ్స్ చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
  • పుట్ట‌గొడుగుల్లో ఉండే విట‌మిన్ బి కాంప్లెక్స్ విట‌మిన్ సి , రైబో ఫ్లేవిన్, నియాసిన్లు శ‌రీరానికి చాలా అవ‌స‌రం. రైబోఫ్లేవిన్ ఎర్ర‌ర‌క్త‌క‌ణాలు అభివృద్ధి చేస్తే, నియాసిస్ చ‌ర్మాన్ని సుర‌క్షితంగా ఉంచ‌డంలో తోడ్ప‌డుతుంది.
    అధిక ర‌క్త‌పోటుని నియంత్రించ‌డంలో తోడ్ప‌డే పొటాషియం పుట్టగొడుగులలో ల‌భిస్తుంది. అలాగే శ‌రీరంలో కండ‌రాల‌ను ఉత్తేజితం చేస్తుంది.
  • సెలీనియ౦ అను యాంటీఆక్సిడెంట్లు ఉండడం వలన క్యాన్సర్ మరియు ఇతర రోగాలను నివారించడంలో తోడ్పడుతుంది. మిగిలిన ఆహార పదార్థాలు అన్నిటికన్నా పుట్ట గొడుగులలో సెలీనియం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోని మృత కణాలను తొలిగించి కొత్త కణాలను వృద్ధి
  • చేస్తుంది.

ఇది కూడా చదవండి .

నల్ల బియ్యం తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలు ..

Share your comments

Subscribe Magazine