Health & Lifestyle

ఆరోగ్యాన్నిచ్చే కాక్టస్ జ్యూస్.. దీని ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదులుకోరు!

KJ Staff
KJ Staff

కాక్టస్ మొక్కను ఒక ఎడారి మొక్కగా భావిస్తారు. నీటి ఎద్దడిని తట్టుకునే జీవించగలదు కనుక దీనిని ఎడారి మొక్క అని కూడా పిలుస్తారు. చాలా మంది రైతులు ఈ విధమైనటువంటి మొక్కలను తమ పంట పొలం చుట్టూ కంచెగా పెంచుతూ ఉంటారు. ఈ క్రమంలోనే కొన్ని రకాల చెట్లు ఆదాయ వనరులుగా మారి రైతులకు మంచి లాభాలను తెచ్చి పెడుతున్నాయి. ఈ క్రమంలోనే చపాతి ఆకారంలో ఆకులను పోలినటువంటి మొక్క ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. మరి చపాతీ కాక్టస్ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం...

చపాతి కాక్టస్ నుంచి తయారు చేసిన జ్యూస్ తాగడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉండటమే కాకుండా
విటమిన్ సి, విటమిన్ బి, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు, కాల్షియం , మెగ్నీషియం , బీటా కారోటీన్ , అమైనో ఆమ్లాలు వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అందుకే మార్కెట్లో ఈ కాక్టస్ జ్యూస్ కి ఎంతో డిమాండ్ ఉందని చెప్పవచ్చు.

ఈ విధమైనటువంటి పోషకాలు కలిగినటువంటి జ్యూస్ తాగడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇందులో క్యాలరీలు తక్కువగా ఉన్నాయి కనుక బరువు తగ్గాలనుకునే వారికి ఇదొక మంచి పానీయం అని చెప్పవచ్చు. అదేవిధంగా తరుచు ఈ జ్యూస్ తాగడం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. ఈ క్రమంలోనే ఎలాంటి గుండె జబ్బులు రాకుండా మనల్ని కాపాడటమే కాకుండా రక్తప్రసరణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది.

ప్రకోప ప్రేగు సిండ్రోమ్ , పెద్దప్రేగు శోథ, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి కూడావిముక్తిని కల్పించడం కోసం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అయితే కొందరికి ఈ జ్యూస్ తాగడం వల్ల కడుపులో వికారం, వాంతులు, చర్మంపై దద్దుర్లు ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తుతాయి.ఈ విధమైనటువంటి సమస్యలు తలెత్తే వారు ఈ జ్యూస్ కు దూరంగా ఉండటం మంచిది.

Share your comments

Subscribe Magazine