Health & Lifestyle

కారు డ్రైవ్ చేస్తున్నారా? సీట్లో ఎలా కూర్చోవాలంటే?

KJ Staff
KJ Staff
car seat
car seat

ఒకప్పుడు కారు అంటే బాగా ధనవంతుల వద్ద మాత్రమే ఉండేది. కారు కొనాలంటే లక్షల్లో ఖర్చు అయ్యేది. అందుకే ధనవంతులు మాత్రమే కొనుగోలు చేసేవారు. కారు ఉందంటే.. వారిని ధనవంతులుగా భావిస్తారు. ఒకప్పుడు లక్షల్లో ఖర్చు ఉంటుంది కనుక సామాన్య, మధ్యతరగతి ప్రజలు కారును కొనుగోలు చేయలేరు. కానీ ఇప్పుడు రూ.లక్షకు కూడా నానో కార్ లాంటివి వస్తున్నాయి. దీంతో మధ్యతరగతి ప్రజలు కూడా కారును వినియోగిస్తున్నారు. ఒకప్పుడు ఎక్కువమంది కారు డ్రైవర్‌ను పెట్టుకునేవాళ్లు.

కానీ ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ పెరిగింది. డ్రైవింగ్ స్కూళ్లకు వెళ్లి స్వయంగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. ఎవరికి కారును వాళ్లు డ్రైవ్ చేస్తున్నారు. అయితే కారు డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా చూసుకోవాలి. అన్నివైపులా చూసుకుంటూ కారు డ్రైవ్ చేయాలి. అలాగే కారు సీట్లో సరిగ్గా కూర్చోవాలి. లేకపోతే నడుము నొప్పి లాంటి పలు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది. ఎలా కూర్చుంటే ఏమవుతుందిలే అని చాలామంది ఇష్టమొచ్చినట్లు కూర్చోని కారు డ్రైవ్ చేస్తూ ఉంటారు.

కానీ ఎలా పడితే అలా కూర్చోవడం వల్లన పలు సమస్యలు వచ్చే అవకావముంది. సరిగ్గా కూర్చోకపోతే వెన్నుముక పెళుసుగా మారి దెబ్బతింటుంది. కండరాల నొప్పులు పెరిగిపోతాయి. మెడ, భుజం, వెన్నునొప్పులు పర్మినెంట్ గా ఉండిపోతాయి. దీని వల్ల శ్వాస సరిగ్గా ఆడకపోవడం, జీర్ణవ్యవస్థ దెబ్బతినడం లాంటివి వస్తాయి. ఇవి రాకుండా అసలు కారు సీట్లో ఎలా కూర్చోవాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కాళ్ల పొడవుగా అనుగుణంగా సీట్ సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. ఎత్తుకు తగ్గట్లు సీటు ఎత్తును అడ్జెట్ చేసుకోవాలి. కాళ్లు పొడవుగా ఉన్నవారు సీట్ ను మరీ ముందుకు ఉంచకుండా తగినంత దూరంలో ఫిక్స్ చేసుకోవాలి. ఒక సీటు ఒంపు నడుము లేదా మోకాళ్ల మీద ఒత్తిడి పడనివ్వకుండా విధగా ఉండాలి. ఇక నడుము దగ్గర ఉండే ఒంపు భాగంగా కుషన్ సపోర్ట్ పెట్టుకోవడంవల్ల నడుపునొప్పి చాలా వరకు తగ్గుతుంది. ఇక సీట్ లో చాలాసేపు ఒకే భంగిమలో కూర్చోకూడదు. అప్పుడప్పుడు పొజిషన్ మారుస్తూ ఉండాలి.

ఇక అదేపనిగా చాలాసేపు డ్రైవింగ్ చేయకూడదు. మధ్యమధ్యలో కాస్త బ్రేక్ తీసుకోవాలి. ఇక డ్రైవ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. నడుమనొప్పి లాంటి సమస్యలు మరింత ఎక్కువైతే డాక్టర్ ను సంప్రదించి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వదిలేస్తే సమస్య మరింత పెరిగే అవకాశముంది. పోశ్చర్ బాగా దెబ్బతింటే కాల్షియం, విటిమిన్ డీ సప్లిమెంట్స్, పెయిన్ కిల్లర్స్ లాంటి మందులు వాడాలి.

 

Related Topics

Car, Seat, Driving

Share your comments

Subscribe Magazine