Health & Lifestyle

క్రెడిట్ కార్డ్ వినియోగదారులకి శుభవార్త...బిల్లింగ్ సైకిల్ మార్చుకోవచ్చు!

S Vinay
S Vinay

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) క్రెడిట్ కార్డ్ వినియోగదారులకి పెద్ద ఊరటనిచ్చింది. ఇప్పుడు వారు తమ సౌకర్యం మేరకు క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్‌ను ఎంచుకోవచ్చు.పూర్తి వివరాలు చదవండి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని క్రెడిట్ కార్డ్ నిబంధనలను సడలించింది.బిల్లింగ్ సైకిల్‌కు సంబంధించి క్రెడిట్ కార్డు అందించే సంస్థలకు ముఖ్యమైన ఆదేశాలను జారీ చేసింది. క్రెడిట్ కార్డ్ యొక్క బిల్లింగ్ సైకిల్‌ను వినియోగదారుల సౌకర్యం ప్రకారం సవరించుకోవడానికి కార్డ్ హోల్డర్‌లకు తప్పనిసరిగా ఒక ఎంపికను అందుబాటులో ఉంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది.బిల్లింగ్ సైకిల్ అనేది రెండు వరుస బిల్లుల ముగింపు తేదీల మధ్య ఉండే వ్యవధి. మీ చెల్లింపు గడువు తేదీ సాధారణంగా మీ బిల్లింగ్ సైకిల్ ముగిసిన 15-25 రోజుల తర్వాత ఉంటుంది.

ఈ క్రెడిట్ కార్డు కొత్త నియమాలు జూలై 1, 2022 నుండి అమలులోకి వస్తాయి. ఇప్పటి వరకు, క్రెడిట్ కార్డ్ జారీ చేయబడిన తేదీ ప్రకారం బిల్లింగ్ సైకిల్ కూడా బ్యాంకుచే నిర్ణయించబడేది. ఇప్పుడు రిజర్వు బ్యాంకు తీసుకువస్తున్న ఈ నియమాలు వినియోగదారులు వారికి అనుగుణంగా మార్చుకునే అవకాశం కల్పిస్తుంది.

క్రెడిట్ కార్డు ఏజెన్సీల దౌర్జన్యం పై చర్యలు:
కార్డ్ జారీ చేసే ఏజెన్సీలు లేదా కస్టమర్‌ల నుండి బకాయిలను వసూలు చేయడానికి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న వారు, బెదిరించడం లేదా వేధించడం వంటివి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోనుంది. ఈ మార్గదర్శకాలు 1 జూలై 2022 నుండి అమలులోకి వస్తాయి.

రెండు లేదా అంత కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను వాడుతున్న వారికి ఈ కొత్త నియమాలు చాలా ఉపయోగకరంగా ఉండబోతున్నాయి. ఎక్కువ కార్డులు ఉన్నవారు, చెల్లింపులను ఏక కాలంలో కాకుండా కొంత వ్యవధి ఉండేలా ఈ నిబంధనలు అవకాశం ఇస్తాయి.

మరిన్ని చదవండి.

మారిన రైల్వే ప్రయాణ నియమాలు...తప్పక తెలుసుకోండి!

వరి సాగులో చేపల పెంపకం...లాభాలు తెలుసుకోండి!

Share your comments

Subscribe Magazine