Health & Lifestyle

ఈ ఐదు సమస్యలతో బాధపడేవారు బాదంపప్పును అస్సలు తినకూడదు?

KJ Staff
KJ Staff

సాధారణంగా బాదంపప్పులో ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే.ప్రతిరోజు కొన్ని బాదం పప్పులను తినడం ద్వారా ఎన్నో పోషక పదార్థాలు మన శరీరానికి అంది మన శరీరాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి.ఈ క్రమంలోనే రాత్రంతా నీటిలో నానబెట్టిన బాదం పప్పులను మరుసటి రోజు ఉదయం తినడం వల్ల ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.అయితే కొన్ని రకాల సమస్యలతో బాధపడేవారు బాదంపప్పుకు దూరంగా ఉండాలని కూడా నిపుణులు చెబుతున్నారు. మరి ఏ విధమైనటువంటి సమస్యలతో బాధపడేవారు బాదంపప్పు దూరంగా ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం...

రక్త పోటు సమస్యతో బాధపడుతూ తరచూ మందులు వాడేవారు బాదంపప్పును తినకూడదని నిపుణులు చెబుతున్నారు. బాదంపప్పులో మాంగనీస్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది రక్తపోటును పెంచడానికి కారణమవుతుంది. విటమిన్ ఇ పుష్కలంగా ఉన్న బాదంపప్పును మైగ్రేయిన్ తలనొప్పితో బాధపడేవారు తినకూడదు. కేవలం తక్కువ పరిమాణంలో తీసుకోవడం లేదా వాటిని పూర్తిగా మానేయడం ఎంతో ఉత్తమం అని చెప్పవచ్చు.

చాలామంది కిడ్నీలోని రాళ్ళ సమస్యతో బాధపడుతుంటారు. ఈ విధమైన సమస్యతో బాధపడేవారు బాదంపప్పుకు దూరంగా ఉండాలి. బాదం పప్పులో ఆక్సలేట్ ఉండటం వల్ల కిడ్నీ సమస్యలను మరింత పెంచుతుంది కనుక బాదంపప్పుకు దూరంగా ఉండాలి. జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉన్నవారు బాదం పప్పును తినకూడదు. అధిక బరువు సమస్యతో బాధపడేవారు బాదంపప్పుకు దూరంగా ఉండాలి.బాదం పప్పులో కేలరీలు అధికంగా ఉండటం వల్ల మరింత శరీర బరువును పెంచి ఊబకాయానికి దారితీస్తుంది. కనుక ఈ విధమైనటువంటి సమస్యలతో బాధపడేవారు పూర్తిగా బాదంపప్పును తినకుండా ఉండటం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Share your comments

Subscribe Magazine