Health & Lifestyle

ఇంట్లో ఉండాల్సిన ఔషధ మొక్కలు

KJ Staff
KJ Staff
Medical Plants
Medical Plants

తులసి
ఇది హిందువులకు పవిత్రమైన మొక్క. అంతే కాదు.. ఆయుర్వేదంలో కూడా దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. దీన్ని చాలా రకాల మందుల్లో కూడా వాడతారు. అందుకే దీన్ని క్వీన్ ఆఫ్ హెర్బ్స్ అని కూడా పిలుస్తారు. దీన్ని రోజూ హెర్బల్ టీలో భాగంగా తీసుకోవచ్చు. తులసి లో రామ తులసి, క్రిష్ణ తులసి, కర్పూర తులసి, వాన తులసి వంటి ఎన్నో రకాలు ఉంటాయి. తులసి డ్రాప్స్ ని చెవిలో డ్రాప్స్ గా వేసుకోవచ్చు. ఇందులో జెర్మిసైడల్, ఫంగిసైడల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ బయోటిక్ గుణాలు ఉంటాయి. ఇది జ్వరం, జలుబు,జీర్ణ సమస్యలు, బ్రాంకైటిస్, దగ్గు, మలేరియా వంటివాటి నుంచి రక్షిస్తుంది.

లెమన్ గ్రాస్
ఇది కూడా ఇంట్లో పెంచుకునే మెడిసినల్ రెసిపీలలో ఒకటి. దీన్ని చాలా చిన్న కుండీల్లో కూడా పెంచుకునే వీలుంటుంది. ఇందులో చాలా మెడిసినల్ గుణాలుంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీన్ని టీ, సలాడ్లు, సూప్ లలో వేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ తో అద్భుతంగా కనిపిస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించేందుకు తోడ్పడుతుంది. ఇందులోని యాంటీ పైరెటిక్ గుణాలు జ్వరాన్ని తగ్గించేందుకు తోడ్పడతాయి. ఇది వివిధ రకాల శ్వాస సంబంధిత సమస్యలను, గొంతు ఇన్ఫెక్షన్లను తగ్గించేందుకు తోడ్పడుతుంది. అంతేకాదు.. ఇది కడుపు నొప్పి, తల నొప్పి, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, జీర్ణ సమస్యలు, కడుపు నొప్పి వంటివి తగ్గిస్తుంది.

మెంతి కూర
మెంతి కూరను మామూలుగా మనం కూరల్లో తీసుకుంటూ ఉంటాం. ఈ గింజలే కాదు.. మెంతి కూడా కూడా ఎంతో పోషకభరితం అని చెప్పుకోవచ్చు. చాలా తక్కువ స్థలంలోనే దీన్ని పెంచుకోవచ్చు. చాలామంది దీన్ని బరువు పెరిగేందుకు ఉపయోగిస్తారు. ఇది లివర్ క్యాన్సర్ ని తగ్గిస్తుంది. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. ప్రసవం తర్వాత తల్లులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రుతుక్రమం సమయంలో వచ్చే నొప్పిని కూడా ఇది తగ్గిస్తుంది. కడుపులోని అల్సర్లను కూడా ఇది తగ్గిస్తుంది. రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయులను కూడా ఇది తగ్గిస్తుంది. నోటి నుంచి దుర్వాసన రాకుండా చేస్తుంది. అందుకే దీన్ని ఇంట్లో పెంచుకోవడం తప్పనిసరి.

పుదీనా
పుదీనా మన ఇంట్లో ఉన్న అద్భుతమైన మందు అని చెప్పుకోవచ్చు. చిన్న కుండీల్లో కూడా ఇది పెరుగుతుంది. దీనికోసం ప్రత్యేకంగా ఎలాంటి శ్రద్ధ వహించాల్సిన అవసరం లేదు. ఇందులో మాంగనీస్, విటమిన్ ఎ, విటమిన్ సి, వంటివి ఎక్కువగా ఉంటాయి. కండరాల నొప్పి ఉంటే పుదీనా ను మెత్తగా చేసి అక్కడ రుద్దుకుంటే అది తగ్గుతుంది. మౌత్ ఫ్రెషనర్ గా కూడా పనిచేస్తుంది. కడుపు నొప్పి, గ్యాస్, జ్వరం, ఐబీఎస్ వంటి సమస్యలను ఇది తగ్గిస్తుంది. బ్యాక్టీరియా పెరగడాన్ని తగ్గిస్తుంది.

కలబంద
కలబంద చాలా అద్భుతమైన మొక్క. దీనికి కాస్త ఎక్కువ ఎండ ఉంటే సరిపోతుంది. ఇంట్లో తప్పక పెంచుకోవాల్సిన మొక్కల్లో ఇది కూడా ఒకటి. ఇది ఇంట్లో ఉంటే దోమలు తక్కువగా ఉంటాయి. చర్మానికి ఉపయోగించడంతో పాటు తినడానికి కూడా ఉపయోగించవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ని తగ్గిస్తాయి. రోగ నిరోధక శక్తి పెరిగేందుకు రోజూ కలబంద జ్యూస్ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్లను కూడా తగ్గిస్తుంది. కాలిన గాయాలు, దెబ్బలపై కూడా వీటిని పూసే వీలుంటుంది. జుట్టు, చర్మం వంటి వాటి ఆరోగ్యాన్ని కూడా ఇది కాపాడుతుంది. ఇది జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తుంది.

బ్రహ్మి
ఇది కూడా ఇంట్లో సులభంగా పెంచుకోగలిగే మొక్క. ఇది తెలివితేటలను కూడా పెంచుతుందట. అంతే కాదు.. అల్సర్లు, చర్మ సమస్యలు, రక్తనాళాల సమస్యలను కూడా ఇది తగ్గిస్తుంది. ఎక్కడైనా గాయాలు, పుండ్లు ఉంటే ఈ ఆకులను మెత్తగా చేసి అక్కడ పూయడం వల్ల అది తగ్గుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థ, నరాల వ్యవస్థను ఇది కాపాడుతుంది.

అశ్వగంధ
అశ్వగంధ నరాల వ్యవస్థపై పనిచేస్తుంది. ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ఫర్టిలిటీని పెంచుతూ.. గాయాలను తగ్గిస్తుంది. అలాగే ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. గుండె సంబంధిత సమస్యలు కూడా రాకుండా కాపాడుతుంది. కంటి ఆరోగ్యాన్ని ఇది కాపాడుతుంది. ఒత్తిడిని తగ్గించడంతో పాటు డిప్రెషన్ ని దూరం చేస్తుంది. కొలెస్ట్రాల్ ని కూడా తగ్గిస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయులను కూడా ఇది తగ్గిస్తుంది.

https://krishijagran.com/news/region-under-medicinal-plants-declined-in-last-5-years-says-reports/


https://krishijagran.com/success-story/get-up-to-3-lakh-per-acre-with-medicinal-plants/

Share your comments

Subscribe Magazine