Health & Lifestyle

రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు ఇవే..!

KJ Staff
KJ Staff

వర్షాకాలంలో సర్వసాధారణంగా వచ్చే సీజనల్ వ్యాధులను ఎదుర్కోడానికి రోజూ తీసుకునే ఆహారంతో పాటు అదనంగా మన ఆహారంలో వ్యాధినిరోధక శక్తిని పెంచే కొన్ని రకాల పండ్లను, కూరగాయలను, ఆకుకూరలను చేర్చుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లను,కూరగాయలను ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం వల్ల మనలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులైన జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి , ప్రమాదకర ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందవచ్చు.

కివి,నారింజ,బత్తాయి, జామ వంటి పండ్లను ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన విటమిన్ సి క్యాల్షియం సమృద్ధిగా లభించి వివిధ రకాల సీజనల్‌ వ్యాధులతో పాటు దీర్ఘకాలిక రోగాలను సైతం ఎదుర్కొనేలా వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో ఈ పండ్లు కీలక పాత్ర వహిస్తుంది.

ఆపిల్ పండులో పీచుపదార్థం, విటమిన్‌ సి, విటమిన్‌ కె ఎక్కువగా ఉంటాయి.ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచడం తో పాటు శరీరంలో మలినాలను తొలగించి బరువు తగ్గడానికి దోహదపడుతుంది. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది.

పెరుగులోని ప్రోబయోటిక్స్ జలుబు తీవ్రతను తగ్గిస్తుంది. అలాగే రోగ నిరోధక శక్తి పెంచడంలో సహాయపడుతుంది.

పుట్టగొడుగులు రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఇందులో ఉన్న ఫైబర్, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ జీర్ణ సంబంధిత వ్యాధులను గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తాయి.

బీట్‏రూట్ రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెంచడమే కాకుండా క్యాన్సర్ వ్యాధిని నియంత్రించడంలోనూ సహాయపడుతుంది. దీనిని రోజూ ఆహారంలో తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతంది.

Share your comments

Subscribe Magazine